Search
Wednesday 26 September 2018
  • :
  • :

కలెక్టరేట్ ఎదుట ఆందోళనకారుల నిరసన

Jail Bharo headed by Left Front affiliates
కరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజు వామపక్ష అనుబంధ సంస్థలు జైల్‌ భరో కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా రైతు, సి.ఐ.టి.యు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు మిల్కురి వాసుదేవరెడ్డి, బండారి శేఖర్, గుడికందుల సత్యంలు మాట్లాడుతూ మెకిన్ ఇండియా, బంగారు తెలంగాణ అంటూ ప్రగల్భాలు పలికిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల మీద మోయలేని భారం మోపారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర చెల్లించాలని, కార్మిక చట్టాలను అమలుచేసి కనీస వేతనాలు ఇవ్వాలని డిమండ్ చేశారు. అదేవిధంగా ఉపాధిహామీ కూలీలకు రోజు కూలీ కనీసం రూ.400లను చెల్లించాలని అన్నారు.

నరేంద్ర మోదీ అధికారంలోని వచ్చిన వెంటనే నల్లధనాన్ని బయటికి తీసుకువచ్చి జీరో అకౌంట్స్‌లో రూ.15 లక్షలు జమచేస్తానని 15 రుపాయలు కూడా జమచేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ధరల నియంత్రణ లేకుండాపోయిందని నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలతో వాహనదారులు తమ వాహనాలను విక్రయించుకుని పరిస్థితి దాపురించిందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైయ్యాయని అన్నారు.

దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూంలను ఇస్తానని సి.ఎం కె.సి.ఆర్ మోసం చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆందోళకారులు కలెక్టరేట్‌లోనికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్యన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ జైల్‌భరో కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మాడిశెట్టి భాగ్యలక్ష్మి, కెవిపిఎస్ కార్యదర్శి సురేష్, ప్రజాసంఘాల నాయకులు యు.శ్రీనివాస్, వడ్లరాజు, ఎడ్ల రమేష్, వెల్పరెడ్డి రాజిరెడ్డి, పిల్లిరవి, కొప్పుల శంకర్, కవ్వంపల్లి ఆజయ్, రభీయా, రాయికంటి శ్రీనివాస్, సదానందం, రజిత, సంపత్‌రావు, ఆశోక్, మణేమ్మ, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments