Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

జైలు క్వార్‌‘డర్‌’లు

  • శిథిలావస్థలో చంచల్‌గూడ, చర్లపల్లి జైలు క్వార్టర్లు

Jails-Cherlapally

హైదరాబాద్: అవినీతి రహిత జైళ్ల శాఖ, లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే బహుమతి ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో ఊదరగొడుతున్న తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ సిబ్బంది స్థితిగతు లు, వారి కుటుంబసభ్యుల బాగోగుల గురించి ఏ మా త్రం పట్టించుకోవడం లేదు. పూర్తి అధ్వానస్థితిలో ఉన్న క్వార్టర్స్‌లో ఉండేందుకు సిబ్బంది కుటుంబాలు జంకుతున్న పరిస్థితులున్నాయి. అపరిశుభ్రతకు ఆనవాళ్ళుగా, స్వచ్ఛభారత్‌కు అందనంత దూరంగా క్వా ర్టర్స్ ఉన్నాయి. కనీసం వీటిల్లో ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలన్న చిత్తశుద్ధి కూడా అధికారుల్లో కనిపించడం లేదు. సిబ్బంది కోసం చర్లపల్లి జైలులో 118 క్వార్టర్స్, చంచల్‌గూడ జైలులో 60 పాత క్వార్టర్స్, 40 కొత్తవి ఉన్నాయి. వీటిని పోలీసు హౌసింగ్ బోర్టు నిర్మించింది. వీటి నిర్మాణాలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. మరమ్మత్తులను చేయాలన్న విషయాన్ని అధికారులు మరచిపోవడంతో చర్లపల్లి జైలులో ఇప్పటికే 80 క్వార్టర్స్ పనికి రాకుండా పోయాయి. రూపులలో ఇనుప చువ్వలు బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. చిన్న పాటి వర్షం కురిస్తే క్వార్టర్స్‌లలోకి నీరు కురుస్తుంది. ఫ్లారింగ్ పగిలి గోతులు తేలాయి. కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. సిబ్బంది క్వార్టర్స్‌కు ఒక్కో ఉద్యోగి నుంచి నెలకు వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. క్వార్టర్స్ అలాటైన వారికి హెచ్‌ఆర్‌ఎ కూడా చెల్లించడం లేదు. అవస్థలకు ఆనవాళ్ళుగా నిలిచిన క్వార్టర్స్‌లో జీవనం గడపలేక, రిపేర్ల కోసం అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో చాలా మంది ఉద్యోగులు వాటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూడా. అయినప్పటికీ అధికారులకు చీమకుట్టినట్లైనా లేకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చర్లపల్లి, చంచల్‌గూడ జైలులోనే దాదాపు 1200 మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారు. ఇందులో కనీసం పదవ వంతు సిబ్బంది కూడా క్వార్టర్స్‌లలో ఉండటం లేదంటే వాటి పరిస్థితి ఎంతటి ధీన స్థితిలో ఉందో స్పష్టమవుతోంది. జైలు పరిసర ప్రాంతాలను శుభ్రంగా, స్వచ్ఛభారత్‌కు సంకేతంగా ఉంచుతున్న అధికారులు క్వార్టర్స్ విషయంలో అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. చినుకు పడితే క్వార్టర్స్ అన్నీ చిత్తడిగా మారుతాయని, విషపు పురుగులు తిరుగుతాయని, రాత్రి పూట వీధి దీపాలు కూడా వెలగవని వారంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధఁగా తెలంగాణ జైళ్ళ శాఖ లాభాలను విపరీతంగా ఆర్దిస్తోందని, అయినప్పటికీ సిబ్బందికి కావాల్సిన వసతుల విషయంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా వివక్షను వీడాలని వారు కోరుతున్నారు. క్వార్టర్స్‌ను చక్కగా తయారు చేసి సిబ్బందికి కేటాయిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.

Comments

comments