Home కరీంనగర్ ఎంవిఐకి జైలు శిక్ష

ఎంవిఐకి జైలు శిక్ష

jail

కరీంనగర్ : అక్రమాస్తుల కేసులో కరీనగర్ అవినీతి నిరోధక శాఖ కోర్టు ఖమ్మం జిల్లా పాల్వంచ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌కు జైలు శిక్ష విధించింది. ప్రతాప్ రూ.30 లక్షల 99 వేల అక్రమాస్తులు సంపాదించాడని కోర్టులో ఎసిబి అధికారులు నిరూపించారు. దీంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.