Home అంతర్జాతీయ వార్తలు ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జైలు

ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జైలు

Jail-Escape

వాషింగ్టన్ : క్రెడిట్ కార్డుల మోసం కేసులో ఇద్దరు ఇండో అమెరికన్లకు కోర్టు జైలు శిక్ష విధించిది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులకు సంబంధించి సుమారు 200 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడిన ఘటనలో విజయ్ వర్మ (49), తర్సీమ్ లాల్ (72)లకు ఏడాదికి పైగా జైలు శిక్ష పడింది. వీరు న్యూజెర్సీలో నగల దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీరు దోషులుగా నిర్ధారణ కావడంతో 14 నెలల జైలు, ఏడాది పాటు గృహనిర్బంధం విధించింది. ఐదువేల డాలర్ల చొప్పున జరిమానా కూడా విధించింది. ఫైన్ కింద 4,51,259 డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వర్మ , లాల్ కలిసి నకిలీ గుర్తింపులతో సుమారు ఏడు వేల క్రెడిట్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు కోర్టులో రుజువైంది.