Home జాతీయ వార్తలు జైన గురువు తరుణ్ సాగర్ కన్నుమూత

జైన గురువు తరుణ్ సాగర్ కన్నుమూత

Jain Monk Tarun Sagar Passed Away

ఢిల్లీ : ప్రముఖ దిగంబర జైన గురువు తరుణ్‌సాగర్ (51) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని కృష్ణానగర్‌లో ఉన్న రాధాపురి జైన్ ఆలయంలో ఆయన మృతి చెందారు. యుపిలోని మురుదానగర్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. జైన మతస్థుల్లో తరుణ్ సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చాలా కాలం నుంచి మందులు తీసుకోవడం మానేశారు. సంతారా పద్ధతిలో ఆయన తన ప్రాణాన్ని విడిచేందుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని దహోవా జిల్లాకు చెందిన తరుణ్ సాగర్ జైన సంప్రదాయాన్ని తన ప్రవచనాల ద్వారా ప్రజలతో పంచుకునేవారు. ఆయన మృతిపై రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు సంతాపం తెలిపారు.

Jain Monk Tarun Sagar Passed Away