Home కరీంనగర్ కరీంనగర్ జిల్లా మల్లారంలో జైనమత తుదిశ్వాస శాసనం

కరీంనగర్ జిల్లా మల్లారంలో జైనమత తుదిశ్వాస శాసనం

stupamమన తెలంగాణ/ హైదరాబాద్ : జైన మత తుదిశ్వాసను గురించి తెలిపే శాసనం కరీంనగర్ జిల్లాలోని మల్హర్ మండలంలోగల మల్లారం గ్రామ పరిధిలో వెలుగు చూసింది. దబ్బగట్టు అని పిలుస్తున్న ఈ శాసన ప్రాంతం మంథనికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని మానేరు బ్రిడ్జి దాటిన తరువాత ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్ ఆవరణకు వంద మీటర్ల దూరంలో ఉంది. ఏడెనిమిది ఏళ్ళ కిందట కొందరు రైతులు కంపచెట్లను నరికి వ్యవసాయం భూమిని సిద్ధం చేసుకుంటున్న క్రమంలో ఈ శాసనసపు శిల వెలుగు చూసిందని ప్రముఖ చరిత్ర శోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మల్లారం గ్రామ ప్రముఖులు చెప్పాల మధుసూదనరావు తన దృష్టికి తేవడంతో స్వయంగా శాసనాన్ని చూసి, చదివి ప్రామాణిక చారిత్రిక విషయాలను సమన్వయం చేసి అది జైన మత తుదిశ్వాసకు సంబంధించిన శాసనమని నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. మల్లారం శాసనమే ఇప్పటి వరకు తెలియవచ్చిన చారిత్రక ఆధార మేరకు తెలంగాణలో జైన మతానికి సంబంధించిన చివరి స్పష్టం చేశారు. ఈ అరుదన శాసనాన్ని పురావస్తు శాఖ వెంటనే సురక్షిత ప్రదేశానికి తరలించి దానికి మరి రెండువైపులా ఉన్న సాంస్కృతిక శాసనాలను కూడా చదివి వాటి పాఠాలను ప్రచురిస్తే తమ గ్రామాల గత చారిత్రక వైభవాలనైనా నెమరు వేసుకోవచ్చని స్థానికులు ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.