Home అంతర్జాతీయ వార్తలు జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతి?

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతి?

Jaish chief Masood Azharఇస్లామాబాద్‌ : భారత్ లో పలు ఉగ్రవాద దాడులకు సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతి చెందినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అజహర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అజహర్ మృతి చెందినట్టు సమాచారం. కొంతకాలంగా అజహర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇంటికే పరిమితమయ్యాడని పాక్‌ విదేశాంగ మంత్రి  ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మసూద్‌ అజహర్‌ మృతిపై అనేక కథనాలు వస్తున్నాయి. కానీ ఈ కథనాలపై స్పష్టత లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jaish Mohammad Chief Masood Azhar Passed Away