Home తాజా వార్తలు రాత్రి ఓ మేటర్ జరిగిందిలే… ‘జంబ లకిడి పంబ’(ట్రైలర్)

రాత్రి ఓ మేటర్ జరిగిందిలే… ‘జంబ లకిడి పంబ’(ట్రైలర్)

jamb-lakidi

హైదరాబాద్: కమెడియన్ శ్రీనివాస్ రడ్డి హీరోగా మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జంబ లకిడి పంబ’. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డికి జోడీగా సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, సత్యం రాజేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి.. ‘అసలు ఈ మగాళ్ల బాడీలో ఉండటం ఎంత నరకమో తెలుసా’ అంటూ అమ్మాయిలా వయ్యారాలు వలకిస్తున్నాడు.ఇకా వెన్నెల కిషోర్, పోసాని సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. హీరోయిన్ సిద్ధి ఇద్నాని అబ్బాయిలా దుస్తులు వేసుకొని గంభీరంగా కనపడుతూ ఆకట్టుకుంది. ఈ సినిమా ట్రైలర్ అంతా ఆద్యంతం కితకితలు పెట్టేలా ఉంది. మరి మీరు  ఓ లుక్కేయండి.