Home స్కోర్ సచిన్‌కు సిఎం అభినందనలు

సచిన్‌కు సిఎం అభినందనలు

Sachin Condolence to Sridevi Death

శ్రీనగర్: భారత మాజీ క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌కు జమ్ముకశ్మీర్ సిఎం మెహబూబా ముఫ్తీ అభినందనలు తెలిపారు. జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఓ పాఠశాల భవన నిర్మాణానికి టెండుల్కర్ తన ఎంపి ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 40 లక్షలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్విట్టర్ ద్వారా ముఫ్తీ లిటిల్ మాస్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘పాఠశాల భవన నిర్మాణానికి ఎంపి కోటా నుంచి నిధులు కేటాయించినందుకు సచిన్‌కు ధన్యవాదములు. మైదానం వెలుపల కూడా మీరు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారంటూ, మెహబూబా ట్వీట్ చేశారు.

Jammu CM Mehbooba Mufti Sayeed Praises Sachin Tendulkar.