Home తాజా వార్తలు సైద్ధాంతిక సమస్యలే ముఖ్య కారణం: జంపన్న

సైద్ధాంతిక సమస్యలే ముఖ్య కారణం: జంపన్న

Jampanna

హైదరాబాద్: తన ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీ నుంచి తాను, తన భార్య బయటకు వచ్చామని జంపన్న తెలిపారు. నరసింహా రెడ్డి అలియాస్ జంపన్న మీడియాతో మాట్లాడుతూ…. తాము లొంగిపోవడానికి ఎవరి బలవంతం ఏమీ లేదన్నారు. మావోల మధ్య ఉన్న సైద్ధాంతిక సమస్యలే ముఖ్య కారణమని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. 80వ దశకం నాటి భూస్వామ్య పోకడలు ఇప్పుడు లేవని తెలిపారు. తనకున్న అభిప్రాయాలను పార్టీలో చర్చించలేకపోయానని, తన ఆలోచనకు అనుగుణంగా పార్టీని మార్చడం సాధ్యం కాదని వెల్లడించారు. మావోయిస్టు నాయకత్వానికి సమాచారమిచ్చే బయటకు వచ్చానని పేర్కొన్నారు. మావోయిస్టు నేత జంపన్న జన జీవన స్రవంతిలోకి వచ్చిన విషయం తెలిసిందే. భార్య రజితతో సహా తో జంపన్న పోలీసుల ముందు లొంగిపోయాడు. జంపన్న అసలు పేరు జీనుగు నరసింహా రెడ్డి. 33 ఏళ్ల క్రితం జంపన్న అజ్ఞాతంలోకి వెళ్లారు.