Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కొండగట్టు నుంచి పవన్‌కల్యాణ్ యాత్ర

Pawan-kalyan-iamge

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజకీయ యాత్ర ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం మూడు జిల్లాల్లో పర్యటించనున్నట్టు చేప్పారు. ఆంజనేయస్వామి దర్శనానంతరం యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. కార్యకర్తలతో సమావేశమయ్యాక తెలంగాణలో చేయబోయే పర్యటన వివరాలు కొండగట్టు వేదికగా ప్రకటిస్తానని వెల్లడించారు. అంతకుముందు సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో భార్య అన్నా, పోలండ్ అంబాసిడర్ ఆడమ్‌తో కలిసి ప్రార్థనలు నిర్వాహించారు. అనంతరం అక్కడ ఉన్న జనసేన కార్యాలయంలో పోలండ్ ప్రతినిధులతో పవన్‌కల్యాణ్  భేటీ అయ్యారు.

Comments

comments