Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

అన్ని స్థానాల్లో పోటీ : పవన్ కల్యాణ్

West Godavari : Jana Sena Party to Contest all Assembly seats in AP

పశ్చిమగోదావరి : 2019 ఎన్నికల్లో ఎపిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన చీఫ్, నటుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. భీమవరంలోని బొమ్మసెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం జనసేన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపిలో మట్టి మాఫియా కూడా తయారైందని ఆయన ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టిడిపి నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, వారి అవినీతి యనమలకుదురు డ్రైన్‌లా కంపుకొడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఎపి ఒకప్పుడు అన్నపూర్ణగా ఉందని, ప్రస్తుతం పంటలు లేక కరవుతో అల్లాడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్షనిస్టులకు తాము భయపడమని ఆయన తేల్చి చెప్పారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాను కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయగలనని, అది రాజకీయాల్లో సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను చర్చించేందుకు అత్యున్నత వేదికగా ఉన్న అసెంబ్లీ నుంచి వైసిపి చీఫ్ జగన్ ఎందుకు పారిపోతున్నారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న వైసిపి ఈ విధంగా వ్యవహరిస్తే, సభలో ప్రజా సమస్యలను ఎవరు లేవనెత్తుతారని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మాని, సైద్ధాంతిక పోరాటం చేయాలని ఆయన జగన్‌కు సూచించారు.

Jana Sena Party to Contest all Assembly seats in AP

Comments

comments