Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

‘డబ్బు, పదవిపై బాబుకు వ్యామోహం తగ్గలేదు’

Janasen Party President Pawan Kalyan Criticizes AP CM Chandrababu Naidu

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘ప్రజా పోరాట యాత్ర’ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పవన్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. 65 ఏళ్ల వయసు వచ్చినా డబ్బు, పదవిపై బాబుకు వ్యామోహం తగ్గలేదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎపికి చాలా కీలకమని పవన్ అన్నారు. రాజకీయరంగంలో ఆర్థిక, సామాజిక జనసేన విప్లవాన్నితీసుకురాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే చంద్రబాబు, లోకేష్, జగన్ లు తన అనుచరులతో కలిసి రావాలని, తాను ఒక్కడినే వస్తానని, ఏ పాలసీపైనైనా డిబేట్ లో కూర్చుందామన్నారు. అప్పుడు ఎవరికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుస్తుందని జనసేనాని సవాల్ చేశారు. అంతేగాక జనసేనకు భావజాలం పుష్కలంగా ఉందని, వైఎస్ఆర్ సిపికి అది లేదన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన విజయం సాధించి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ తెలిపారు.

Comments

comments