Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

టిడిపి నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan-kalyan-image

అమరావతి: టిడిపి నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. టిడిపి ఎంఎల్ఎలు ఏమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా? వాళ్లకు ప్రజలేమైన బానిసలమా..? అని పవన్ ప్రశ్నించారు. ప్రజలకు సేవచేయడానికి వచ్చినవాళ్లు రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని సూచించారు. ఎంఎల్ఎలు వారి కొడుకులు, అల్లుడ్లులు ఎవరైనా సరే ఆ పరిధికి లోబడే ఉండాలన్నారు. ఇష్టం వచ్చినట్టు సమాజాన్ని దొచుకుంటాం అంటే తాము చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని టిడిజి నేతలను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాను అన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రజలకు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్యంగా ముందడుగువేశానని పవన్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో ప్రజల తలరాతలు మార్చవచ్చునని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంతకంతో ఉత్తరాంధ్రకు చెందిన 23 వెనుకబడిన కులాలను జాబితా నుంచి తొలగించారని ఆయన తెలిపారు. అదే విధంగా ఎపిలో టిడిపి నేతల సంతకాలతో ప్రజల తలరాతలు మారిపోతున్నాయని పవన్ చెప్పుకొచ్చారు. మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టిడిపి నేతలు పిండిచేసేస్తారని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. తప్పు చేస్తున్నవాళ్లను తానెందుకు ప్రశ్నించకూడదని పవన్ నిలదీశారు.

Comments

comments