Home జాతీయ వార్తలు చంద్రబాబు, జగన్ లకు పవన్ కల్యాణ్ సవాల్

చంద్రబాబు, జగన్ లకు పవన్ కల్యాణ్ సవాల్

pawan kalyan says he will be fight on special status

విశాఖపట్నం: ప్రజా పోరాటయాత్రలో భాగంగా శుక్రవారం తగరపువలసలో చేపట్టిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్ కోసం తాను పోరాడతా అని చెప్పారు. ఎపి సిఎం చంద్రబాబు, వైసిపి అధ్యక్షుడు జగన్ తనతో కలిసి ఉమ్మడి పోరాటం చేయగలా..? అని ఆయన ప్రశ్నించారు.  రైల్వే జోన్‌ విషయంలో నా వైఖరి ఏంటని అడుగుతున్నారు. అయితే ముందు మీ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. 19 మంది ఎంపిలు రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేశారు. మీతో పాటు నేను వస్తా.. రైల్‌రోకో చేద్దాం, అని  పవన్ కల్యాన్ సవాల్ విసిరారు. అవంతి, మురళీమోహన్‌కు హోదా, జోన్ అంటే హేళన అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భూదోపిడిలు ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు. అందులో టిడిపి నేత‌లు ముందు వరసలో ఉన్నారని చెప్పారు. జ్యూట్‌మిల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని గంటా శ్రీనివాసరావును గెలిపించామని గుర్తుచేశారు. కాలుష్యంతో 24 జాతుల మత్స్య సంపద నాశనం అవుతోందని పవన్ ఫైర్ అయ్యారు.