Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సిఎం జగన్‌ను కలిసిన జనసేన ఎంఎల్ఎ

సిఎం జగన్‌ను కలిసిన జనసేన ఎంఎల్ఎ

jaganఅమరావతి: ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో జనసేన పార్టీ ఎంఎల్ఎ వరప్రసాద్ బుధవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు తొలిరోజు హాజరైన వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం తర్వాత సిఎం ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడ ఆయనతో కాసేపు మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్ తాను మర్యదాపూర్వకంగానే సిఎం జగన్‌ను కలిశానని మీడియాకు తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున వరప్రసాద్ ఎంఎల్ఎగా గెలిచిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎంఎల్ఎ కావడంతో ఆయన అధికార పార్టీ వైసిపిలో చేరనున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవల వరప్రసాద్ తేల్చిచెప్పారు. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనకు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరి జనసేనకు షాక్ ఇచ్చారు.
Janasena Party MLA Rapaka Varaprasad Meets CM Jagan