Search
Thursday 18 October 2018
  • :
  • :

‘ఎల్లో మీడియాను బహిష్కరించండి’: జనసేనాని

Janasena Party President Pawan Kalyan Calls Boycott Yellow Mediea

‘ఎల్లో మీడియాను బహిష్కరించండి’ అంటూ టాలీవుడ్ అగ్రనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘జనసేన’ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘మన అక్కాచెల్లెళ్లు, అమ్మలు, కూతుళ్లను దుర్భాషలాడుతూ కథనాలు ప్రసారం చేసే టివి9, టివి5, ఎబిఎన్ లను బహిష్కరించండి అని చెప్పారు. నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నందుకు వాటిని మనం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నిస్సహాయిరాలైన సోదరిని ఉపయోగించుకునే వ్యాపారం చేస్తున్నారు..’ అని పవన్ తన ట్వీట్ లో దుయ్యబట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Comments

comments