Home తాజా వార్తలు కొండగట్టులో జనసేనాని ప్రత్యేక పూజలు

కొండగట్టులో జనసేనాని ప్రత్యేక పూజలు

pawan kalyan press meet on ap special status

జగిత్యాల: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వేద పండితులు పవన్‌కు స్వాగతం పలికారు. అనంతరం జనసేనాని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్ ఆలయ అభివృద్ధికి కోసం రూ. 11 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇక పవన్ తన నిరంతర ప్రజాయాత్రను ఇవాళ్టి నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Janasena Party President Pawan Kalyan Visits Kondagattu Anjaneya Swamy Temple.