Home తాజా వార్తలు కరుణానిధికి పవన్ సంతాపం

కరుణానిధికి పవన్ సంతాపం

Janasena President Pawan Kalyan Tributes to Karunanidhi

హైదరాబాద్: రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత ‘కళైంజర్’ కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తాజాగా ఆయన మృతి పట్ల జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పవన్ కోరుకున్నారు. ఈ సందర్భంగా కరుణానిధి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణ మృతి తమిళ రాజకీయాలకు తీరని లోటు అని పవన్ పేర్కొన్నారు.