Home జనగామ అనాథకు అండగా సఖీ సెంటర్…

అనాథకు అండగా సఖీ సెంటర్…

Jangaon Sakhi Center

 

జనగామ: దిక్కుతోచని స్థితిలో అనాథగా జనగామ రైల్వేస్టేషన్‌లో సంవత్సరం కొడుకుతో ఉన్న గుర్తు తెలియని యువతికి జనగామ సఖీ సెంటర్ అండగా నిలిచి తన స్వస్థలంలోని స్వధార్‌కి చేర్చింది. ఏప్రిల్ 3వ తేదీన జనగామ రైల్వేస్టేషన్‌లో బాధితురాలిని గుర్తించిన జనగామ ఎస్ఐ వర్ధన్ సఖీ టోల్‌ఫ్రీ నంబర్ 181 కాలు చేయడంతో సఖీ బృంద సభ్యులు స్టేషన్ కు చేరుకొని బాధితురాలిని తన కుమారుడితో సహా సఖి సెంటర్‌కు తీసుకొచ్చి ఆశ్రయమిచ్చారు. బాధితురాలి కనీస అవసరాల కోసం కిట్టును అందజేసి భోజన వసతి వైద్య సహాయం అందించి పన్నెండు రోజుల పాటు వసతి కల్పించారు. తన చిరునామా తనకు సంబంధించిన విషయాలను సరిగ్గా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తను కర్ణాటక రాష్ట్రంలోని దార్వాడ్ జిల్లాకు చెందినదిగా గుర్తించి అక్కడి అధికారులను సంప్రదించి బాధితురాలికి సంబంధించిన గుర్తింపును విషయాలను నిర్ధారణ చేసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు.

అనంతరం తన ఇష్టపూర్వకంగా సొంత ప్రాంతానికి వెళుతానన్న బాధితురాలి కోరిక మేరకు దార్వాడ్ జిల్లా అధికారుల జనగామ డీడబ్లూవొ పద్మజారమణ, జనగామ డిసిపి, ఐసిపిఎస్, డిసిపివొ సహాయ సహకారాలతో జనగామ సఖీ సైకో సోషల్ కౌన్సెలర్ బి.రజని పోలీస్ సెక్యూరిటీతో బాధితురాలిని తన కుమారుడిని దార్వాడ్ జిల్లాలోని హుబ్లీ స్వధార్ సెంటర్‌లో సురక్షితంగా అప్పగించారు. బాధితురాలి సంక్షేమ విషయంలో సహకరించిన జనగామ సఖీ టీమ్ సభ్యులకు సిఎ శోభా, కౌన్సెలర్లు రజనీ, సుజిత, సఖీ టీమ్ సభ్యులకు డీడబ్లూవో పద్మజారమణ, బతుకమ్మ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆదిలక్ష్మీ, చీఫ్ అడ్వైజర్ భాస్కర్ అభినందనలు తెలిపారు.

Jangaon Sakhi Center shelter to orphan woman