Home సినిమా బయోపిక్ మూవీలో జాన్వీ

బయోపిక్ మూవీలో జాన్వీ

శ్రీదేవి నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన జాన్వీకపూర్ ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తోంది. వెల్లువలా వస్తున్న అవకాశాలను ఎడాపెడా ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్‌గా ఎంచుకుంటోంది. ప్రస్తు తం కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఓ మల్టీస్టారర్‌కు సైన్ చేసిన ఈ భామ తాజాగా ఓ బయోపిక్ మూవీకి ఓకే చెప్పిందని సమాచారం. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా కథ ఆధారంగా రూపొందే మూవీలో ఆమె పాత్ర జాన్వీకే దక్కిందట. ఇంత చిన్న వయసులో అంత ఛాలెంజింగ్ రోల్ దక్కించుకోవడం పట్ల జాన్వీ ఎంతో సంతోషంగా ఉందట. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం లో గుంజన్ చేసిన సాహసాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆమె వీర గాథను ఇప్పు డు ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం గుంజన్ సక్సేనాను కలిసి ఆమె అనుభవాలను తెలుసుకుందట జాన్వీ కపూర్. ఇక ఈ సినిమా విషయంలో జాన్వీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట.

Janhvi Kapoor to get ready for Gunjan Saxena biopic

Telangana News