Home సినిమా లిప్ కిస్ సాధారణమే

లిప్ కిస్ సాధారణమే

Janvi kapoor Dhadak Movie Shooting  Things

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా ‘సైరాత్’కి ఇది హిందీ రీమేక్. ఇషాన్ ఖత్తర్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. తొలి సినిమానే అయినా షూటింగ్ ప్రారంభంలో జాన్వి సెట్స్‌లో ఎంతో హుషారుగా కనిపించేది.  అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆమె కొంత డల్ అయిపోయింది. దీంతో మళ్లీ జాన్వీని హుషారుగా మార్చేందుకు ఫిల్మ్‌మేకర్స్ చాలా శ్రమించాల్సి వచ్చింది. అంతేకాదు కపూర్ ఫ్యామిలీ నుంచి పలువురు ప్రముఖులు ఆమెను ఓదార్చి కెరీర్‌పై దృష్టిపెట్టాలని సూచించారు.  ఈక్రమంలో వారంతా వీలు చిక్కినప్పుడల్లా సెట్స్‌కి వెళ్లేవారట. ఇక ‘ధడక్’ సినిమాలో జాన్వీకపూర్, ఇషాన్ ఖత్తర్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. రొమాంటిక్ సీన్స్‌లో జాన్వీ రెచ్చిపోయి నటించిందనే ప్రచారం జరుగుతోంది. టీజర్‌లో చూపించిన లిప్ కిస్ సీన్ గురించి దుమారం చెలరేగుతుండడంతో దీనిపై జాన్వీ కపూర్ స్పందించింది. “సినిమాలో లిప్ కిస్ సీన్ సాధారణమే కదా. అదేమీ నేరం కాదు. ఆ సీన్ ఎలా చేశామన్నది మాకు తెలుసు. సినిమా రిలీజ్ కాకముందే వివాదాలు సృష్టించడం సబబు కాదు”అని పేర్కొంది జాన్వీ.