Home సినిమా వరుసగా ఆ ఫిల్మ్‌మేకర్‌తోనే సినిమాలు

వరుసగా ఆ ఫిల్మ్‌మేకర్‌తోనే సినిమాలు

Janvikapoor Busy with Bollywood Movies

బాలీవుడ్‌లో బిజీ అవుతోంది జాన్వీకపూర్. తొలి సినిమా ‘దఢక్’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. స్టార్ ఫిల్మ్‌మేకర్ కరణ్‌జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు జాన్వీని తమ సినిమాల్లో నటింపచేసేందుకు ఫిల్మ్‌మేకర్స్ పోటీపడుతున్నారు. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు దక్షిణాది ఫిల్మ్‌మేకర్స్ ఆమెతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. అయితే జాన్వీ మాత్రం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. ఇక ఈ భామ చేస్తున్న నెక్స్ సినిమా ‘తఖ్త్’. ఇది కూడా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రణవీర్ సింగ్, కరీనాకపూర్, అలియాభట్, జాన్వీ కపూర్, అనిల్‌కపూర్, విక్కీ కౌశల్ నటిస్తున్నారు.
జాన్వీ మూడో సినిమా కూడా కరణ్ బ్యానర్‌లోనే అని వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ‘దోస్తానా’ సినిమాకు కరణ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తయిందట. ‘దోస్తానా 2’గా ఈ సినిమా రాబోతోంది. ఇందులో ఒక హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాను తీసుకున్నారు. అతని సరసన జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా సెట్ చేస్తున్నారని సమాచారం. ఇదంతా చూస్తుంటే జాన్వీని కరణ్‌జోహార్ ఇప్పుడప్పుడే వదలడని స్పష్టం అవుతోంది.