Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

స్నాప్‌డీల్-ఫ్లిప్‌కార్ట్ బంధానికి పచ్చ జెండా

softbank-flipkart-snapdeal

ముంబయి: అతిపెద్ద ఇ -కామర్స్ విలీనానికి సిద్ధమైన జపనీస్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్  కీలకమైన అనుమతి సాధించింది. సాఫ్ట్‌బ్యాంక్ కోఇన్వెస్టర్ నెక్సస్ వెంచర్ పార్టనర్స్ (ఎన్‌విపి)  ఈ మెగాడీల్‌కు ఓకె  చెప్పిం ది.   ఈ విక్రయ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి  ఎన్‌విపితో  ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే మరో ఫౌండర్ కలారీ అనుమతిని సాధించిన సాఫ్ట్ బ్యాంక్, స్నాప్‌డీల్‌లో అతి పెద్దవాటాదారుగా  ఈ అమ్మక ఒప్పందానికి మరింత చేరువైంది. ఆన్‌లైన్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ వారంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశంది. అనంతరం వెంటనే ఈ డీల్ అమల్లో కి రానుంది.   అయితే దీనిపై  అధికారికంగా ఫ్లిప్‌కార్ట్, సాఫ్ట్‌బ్యాంక్ స్పందిం చాల్సిఉంది.  తాజా నివేదికల ప్రకారం  ఈ మెగాడీల్ ద్వారా స్నాప్‌డీల్ ఫౌం డర్స్‌కు 25 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. మరోవైపు కొత్త సంస్థలో ఎన్‌వి పి 100 మిలియన్ల డాలర్ల వాటా, కలారీకి సుమారు 70-80 మిలియన్ డాల ర్లు దక్కనున్నాయి.  కాగా 2016-17లో స్నాప్ డీల్ పెట్టుబడుల కారణంగా 1 బిలియన్ డాలర్లు(రూ.6,500కోట్లు) నష్టపోయినట్టు   ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులేటరీ ఫైళ్ల దాఖలు ప్రకారం, సాఫ్ట్‌బ్యాంక్ ప్రస్తుతం స్నాప్ డీల్‌లో 30 శాతం వాటా, నెక్సస్ సుమారు 10 శాతం వాటాను,కలారి 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఈ కామర్స్ రంగంలో ఇది మెగాడీల్‌గా నిలవనుందని, తీవ్రమైన పోటీ ఉండనుందని మార్కెట్  పండితులు విశ్లేషిస్తు న్నారు. అలాగే  భారత ఇ-కామర్స్ రంగంపై పట్టుబిగించేందుకు  భారీ పెట్టు బడులతో   పావులు కదుపుతున్న అమెరికా ఇ-కామర్స్ దిగ్గజం, ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు   ఫ్లిప్‌కార్ట్ గట్టిషాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు.

Comments

comments