Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భారీ వర్షాలు… 179కు పెరిగిన మృతులు

japan

టోక్యో: జపాన్‌లో ఎడతేరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ఆ దేశప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి.  ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 179కు చేరిందని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి, వందల సంఖ్యలో గ్రామీణ ప్రజలు గాయపడ్డారు. 1982 తర్వాత జపాన్‌లో వర్షాల కారణంగా భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదేనని అక్కడి పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ వరదల్లో దాదాపు 70 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్, వెస్ట్రన్ జపాన్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వానలకు దాదాపు 8మిలియన్ల మంది వారి ఇళ్లను ఖాళీ చేశారు. వేలాది ఇళ్లకు విద్యుత్త్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2లక్షల ఇండ్లకు తాగాడానికి నీరు అందడంలేదు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ దేశ ప్రధాని షింజో అబే ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Comments

comments