Home తాజా వార్తలు ఢిల్లీలో జాట్ల ఆందోళన

ఢిల్లీలో జాట్ల ఆందోళన

JATS

ఢిల్లీ : జాట్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కలిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది జాట్ల నినాదాంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రిజర్వేషన్ల కోసం తొలుత హరియాణాలో జాట్ల ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆందోళనకు మద్దతుగా యుపి, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీ , పంజాబ్‌ల నుంచి వచ్చిన జాట్ కులస్థులతో జంతర్‌మంతర్ వెళ్లే రోడ్డు కిక్కిరిసిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తమకు రిజర్వేషన్లు కలిపించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ , ప్రధాని నరేంద్రమోడీలకు వినతిపత్రాలు ఇవ్వనునేనట్లు జాట్ల నేత యశ్‌పాల్ తెలిపారు. పార్లమెంట్ వరకు నిరసన ర్యాలీ చేపడుతామని ఆయన వెల్లడించారు. గత ఏడాది హరియాణాలో జరిగిన ఆందోళనలో అరెస్టు అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కలిపించే వరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది రిజర్వేషన్ల కోసం జాట్లు చేసిన ఆందోళనలో 30 మంది వరకు చనిపోయిన విషయం తెలిసిందే.