Home తాజా వార్తలు ఆర్మీక్యాంప్‌పై ఉగ్రదాడి: జవాన్ వీరమరణం

ఆర్మీక్యాంప్‌పై ఉగ్రదాడి: జవాన్ వీరమరణం

Attack-on-Army-Camp

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం అర్ధ రాత్రి ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.  ఉగ్రవాదులు సన్‌జౌన్ ఆర్మీ క్వార్టర్స్ పై దాడులు జరిపారు. ఈ దాడిలో ఒక జవాను వీరమరణం పొందగా ఏడుగురు గాయపడ్డారు. ఉగ్రదాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. క్విక్ రియాక్షన్ టీమ్ రంగంలోకి దిగి తీవ్రవాదులకు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఆర్మీక్యాంప్‌పై దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు జైస్ ఏ మహ్మద్ సంస్థకు చెందిన వారేనని ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్‌గురును ఉరితీశారు.  అఫ్జల్‌గురు వర్ధంతి సందర్భంగా ఉగ్రదాడి జరిగినట్టు సమాచారం. ఉగ్రవాదులు యూరీ తరహా దాడికి ప్రయత్నించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడి ఘటనపై జమ్మూ కశ్మీర్ డిజిపితో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ అధికారులు, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ దాడిపై ఆరా తీశారు.