Search
Sunday 18 November 2018
  • :
  • :

ఘనంగా జయలలిత జయంతి వేడుకలు

JAYA-1

చెన్నయ్ : తమిళనాడు దివంగత సిఎం జయలలిత 69వ జయంతి వేడుకలను చెన్నయ్‌లో ఘనంగా నిర్వహించారు. అన్నాడిఎంకె పార్టీ ఆధ్వర్యంలో ఓమండూర్ ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సిఎం ఎడపాటి పళనిస్వామి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జయ చిత్ర పటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా బెంగళూరు జైలులో ఉన్న అన్నాడిఎంకె ప్రధానకార్యదర్శి శశికళ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. 33 ఏళ్ల పాటు జయలలిత పుట్టిన రోజును ఆమెతో కలిసి జరుపుకున్నానని, ప్రస్తుతం అమ్మ లేకుండా జరుపుకోవడం బాధగా ఉందని లేఖలో పేర్కొన్నారు. అమ్మ ఆశయాలు సాధించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆమె కోరారు.

Comments

comments