Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లి ప్రత్యేక ఆటగాడు

జయసూర్య కామెంట్
kohliన్యూఢిల్లీ: భారత టెస్ట్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని వ్యాఖ్యాతల నుంచి మాజీ ఆటగాళ్ల దాకా అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య చేరిపోయారు. ప్రపంచంలోని క్రికెటర్లలో విరాట్ ప్రత్యేక ఆటగాడని కొనియాడారు. కోహ్లి దృక్పథం, ఆట కోసం అతడు పడే తపన, అతడిని ఇతరుల కంటే భిన్నంగా నిలిపిందని అన్నాడు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ సిరీస్‌లో చెలరేగి ఆడుతున్న విరాట్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు టి20ల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి వన్డేల్లో రెండో స్థానంలో ఉన్నాడు. ఇలా అన్ని ఫార్మాట్‌లలోనూ తిరుగులేని ఆటగాడిగా కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు.

Comments

comments