Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

జయలలిత మృతి కేసు : వైద్యుడికి సమన్లు

JAYA

చెన్నయ్ : తమిళనాడు దివంగత సిఎం జయలలితకు వైద్యం చేసిన వైద్యుడు డాక్టర్ శివకుమార్‌కు గురువారం దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. జయ మృతి వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీయాలని పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో జయ మృతిపై విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయ మృతి కేసులో ఇప్పటికే ఆమెకు చికిత్స అందించిన అపోలో, జయ నెచ్చెలి శశికళ, శశి మేనల్లుడు దినకరన్‌కు సమన్లు అందజేసి, వారిని విచారించింది. తాజాగా జయ వ్యక్తిగత వైద్యుడు అయిన శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది.

Jayalalitha Case : Summons to Doctor

Comments

comments