Home జాతీయ వార్తలు జయలలిత ఎన్నడూ గర్భం దాల్చలేదు

జయలలిత ఎన్నడూ గర్భం దాల్చలేదు

jayalalithaఆస్తుల కోసమే అమృత ఆమె కూతురునని చెప్పుకుంట్నునది
హైకోర్టుకు నివేదించిన తమిళనాడు ప్రభుత్వం
సాక్షంగా విడియో సమర్పణ

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన జీవిత కాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు వెల్లడించింది. బెంగళూరుకు చెందిన అమృత తాను జయలలిత కూ తురినంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు సంబంధించిన కేసు విచారణ సమయంలో తమిళనాడు ప్రభు త్వం స్పందించింది. ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్, జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదని బుధవారంనాడు కోర్టుకు తెలిపారు. పిటిషన్‌దారు జయలలిత ఆస్తుల కోసమే కూతుర్నని చెప్పుకుంటున్నారని వాదించారు.
ఆమె జయలలిత కూతురైతే ఎందుకు ఒక్క ఫొటో కూడా తీసుకోలేదని అన్నా రు. అమృత అందించిన రికార్డుల ప్రకారం తాను 1980 ఆగస్టులో జన్మించినట్లు చెప్పారని, అయితే ఆమె చెప్తున్న పుట్టిన తేదీకి నెల రోజుల ముందు జయలలిత ఓ ఫిలిం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారని కోర్టుకు విన్నవించారు. ఆ వీడియోను విజయ్ నారాయణ్ కోర్టుకు అందించారు. 1980లో నాటి ఆ వీడియోలో జయలలిత గర్భంతో ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిపారు. అమృత కేవలం ఆస్తి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు. అవసరమైతే జయలలిత బంధువులతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కోరారు. న్యాయమూర్తి కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అమృత తన పిటిషన్‌లో జయలలిత పార్థివ దేహాన్ని వెలుపలికి తీసి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అమృత ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా, కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. జయలలిత 2016 డిసెంబరు 5వ తేదీన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.