Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

జయమ్మను కిందకు తోసేశారు: పాండియన్

Jayalalitha

చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శశికళకు వ్యతిరేకంగా అన్నాడీఎంకె పార్టీ నేతలు గొంతువిప్పుతున్నారు. శశికళపై అన్నాడిఎంకె మాజీనేత పాండియన్ సంచలన ఆరోపణలు చేశారు. జయలలితది సహజ మరణం కాదన్నారు. పోయెస్ గార్డెన్‌లో జయలలితను కిందకు తోసేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా శశికళ చూశారని మండిపడ్డారు. శశికళ పాత్రపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం పదవికి ఆమె అనర్హురాలని విమర్శించారు.

పాండియన్ ఆరోపణలను అన్నాడిఎంకె పార్టీ నేతలు కొట్టిపారేశారు. పొలిటికల్ మైలేజ్ కోసమే పాండియన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జయలలిత చికిత్స వివరాలను వైద్యులు ఇప్పటికే వెల్లడించారన్నారు.

Comments

comments