Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఇలాంటి కష్టాలెన్నింటినో జయలలిత అధిగమించారు : శశికళ

Sasikala-Natarajanచెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. ఓ వైపు పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతుండటంతో, శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కాంచీపురం జిల్లాలోని గోల్డెన్ బే రిసార్టులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల శిబిరానికి వరుసగా రెండో రోజు కూడా శశికళ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మద్దతుదారులతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. “రాజకీయాల్లో మహిళ కొనసాగడం ఎంతో కష్టం. ఇలాంటి కష్టాలెన్నింటినో జయలలిత అధిగమించారు. మేము కూడా అలాగే ఈ సవాళ్లను అధిగమిస్తాం. పూర్తి ఐదేళ్లపాటు తమిళనాడులో అన్నాడిఎంకె ప్రభుత్వం కొనసాగుతుంది.” అని స్పష్టం చేశారు.

Comments

comments