Home తాజా వార్తలు జయలలిత మాజీ డ్రైవర్ అనుమానాస్పద మృతి

జయలలిత మాజీ డ్రైవర్ అనుమానాస్పద మృతి

Jayalalithaa-Smile

కొయంబత్తూర్ : తమిళనాడు మాజీ సిఎం , దివంగత జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాలెం జిల్లాలోని అత్తూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనకరాజు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కానీ కనకరాజును హత్య చేశారని జయలలిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. జయలలితకు చెంది ఎస్టేట్‌లో ఈనెల 24వ తేదీన జరిగిన కాపలాదారుడి హత్య, అనంతరం జయ ఆస్తులకు , అన్నాడిఎంకెకు చెందిన కీలక పత్రాల అపహరణకు కనకరాజు కుట్ర పన్నినట్లు పోలీసులు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కనకరాజు కోసం గాలిస్తున్న పోలీసులకు ఆయన శవమై కనిపించాడు. ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.