Home తాజా వార్తలు జెసిజె 2017 రాతపరీక్ష ఫలితాల విడుదల

జెసిజె 2017 రాతపరీక్ష ఫలితాల విడుదల

CORT-IMAGE

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి రాష్ర్టాల్లోని దిగువ కోర్టుల్లో జూనియర్ సివిల్ జడ్జి(జెసిజె) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను ఉమ్మడి హైకోర్టు వెల్లడించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ట్రాన్స్‌ఫర్ రిక్రూట్‌మెంట్ కోటాల్లో 23 పోస్టులకుగాను 33 మంది రాతపరీక్షల్లో అర్హులుగా ఎంపికయ్యారు. వీరికి ఈనెల 27, 28న హైకోర్టు ప్రాంగణంలో మౌఖిక పరీక్షలు జరపనున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు.