Home కెరీర్ జెఇఇ మెయిన్స్ ఫలితాలు విడుదల

జెఇఇ మెయిన్స్ ఫలితాలు విడుదల

JEE-Mains

న్యూఢిల్లీ : జెఇఇ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సిబిఎస్‌ఇ గురువారంనాడు ఈ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాల కోసం జెఇఇ వెబ్‌సైట్ సందర్శించాలని సిబిఎస్‌ఇ తెపింది. ఐఐటిలతో పాటు అత్యుత్తమ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు జెఇఇ మెయిన్స్ ఫలితం ఉపయోగపడుతుంది. ఈ నెల 18న మెయిన్స్‌కు సంబంధించి స్కాన్ చేసిన ఒఎంఆర్ షీట్లను సిబిఎస్‌ఇ విడుదల చేసింది. తాజా ర్యాంకులను విడుదల చేసింది. మరోవైపు జెఇఇ మెయిన్స్ ఫలితాల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్ వీర్వాల్‌కు మొదటి ర్యాంకు దక్కింది. మొత్తం 360 మార్కులకుగాను360 సాధించి అతడు ఈ ఘనత సాధించాడు.

కల్పిత్ ఇప్పటికే జాతీయ టాలెంట్ టెస్ట్‌తో పాటు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లలోనూ టాప్ ర్యాంకులు సాధించాడు. మరోవైపు జెఇఇ ఫలితాల్లో ఈ సారి తెలుగు విద్యార్థులు నిరాశ మిగిల్చారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను సుమారు 12లక్షలమంది రాశారు. అందులో 1.60లక్షల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మే 21న జరిగే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. ఈ నెల 28 నుంచి అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జెఇఇ మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థికి ఆరవ ర్యాంకు

జెఇఇ మెయిన్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరుగైన ర్యాం కులు సాధించారు. ఆలిండియా స్థాయిలో హైదరాబాద్‌కు చెందిన మోహ న్ అభ్యాస్ ఒపెన్ కేటగిరిలో ఆరవ ర్యాంకులో నిలిచారు. టాప్ 50 ర్యాం కుల్లో 6,9,11,13,24 ర్యాంకులు పొందగా, టాప్ 100 ర్యాంకుల్లో 26 ర్యాంకులు సాధించారు. ఈ ఏడాది ఇంటర్ మార్కుల వెయిటేజి తొల గించారు. ఆలిండియా స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యా ర్థులు మెరుగైన ర్యాంకులు పొందారు.

ఐఎఎస్ అధికారినవుతా : డి.వరుణ్ తేజ్, ఆలిండియా 9 ర్యాంకు

ముంబయి ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్‌కు సిద్ద మవుతా. ఐఎఎస్ కావాలన్నదే నా లక్షం. మా నాన్న కానిస్టేబుల్‌గా పని చేస్తూ కష్టపడి చదివించారు. కష్టపడి చదివి మా తల్లిదండ్రుల కలలు నిజం చేస్తా.

శాస్త్రవేత్తను కావాలనుకుంది : దిడ్డి సాయికిరణ్, ఆలిండియా 24వ ర్యాంకు

ఐఐటిలో ఇంజనీరింగ్ ఆ తర్వాత చదువు కొనసాగిస్తాను. భవిష్యత్తులో శాస్త్రవేత్తనై మెరుగైన పరిశోధనలు నిర్వహించాలని ఉంది. మా నాన్న ఆర్టీసిలో పనిచేస్తూ ఎంతో కష్టపడి నన్ను చదివించారు. కష్టపడి చదివి మా తల్లిదండ్రలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తాం.