Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జెఇఇ, నీట్ ఏడాదికి రెండుసార్లు

ind

జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహణ జనవరి, ఏప్రిల్‌లో జెఇఇ
ఫిబ్రవరి, మేలో నీట్
జవదేకర్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలయిన నెట్, నీట్, జెఇఇ (మెయిన్స్)లను ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. కొత్తగా ఏర్పా టు చేసిన జాతీయ టెస్టింగ్ ఏజన్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇప్పటివరకు ఈ పరీక్షలను సిబిఎస్‌ఇ నిర్వహించేది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)ను డిసెంబర్‌లో, జెఇఇ( మెయిన్స్)ను ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. ఇక నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో నిర్వహిస్తారని జవడేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షలకు విద్యార్థులు రెండు సార్లూ, లేదా ఏదయినా ఒకసారి హాజరు కావచ్చని ఆయన తెలిపారు. ఎక్కువ స్కోరు వచ్చిన పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశంకోసం నిర్వహించే అర్హతా పరీక్ష అయిన నెట్ కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే తొలి పరీక్షగా ఉంటుంది. ఈ ఏజన్సీ సి మ్యాట్, జి ప్యాట్‌లను కూడా నిర్వహిస్తుందని జవడేకర్ తెలిపారు. పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉంటాయని మంత్రి తెలిపారు. లీకేజి సమస్యలు ఉండవని, విద్యార్థులకు ఎక్కువ అనుకూలంగా శాస్త్రీయ పద్ధతిలో ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఇంటివద్దనే ఉండి, లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్లకు వెళ్లి ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. త్వరలోనే అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

Comments

comments