Home జగిత్యాల కెసిఆర్‌పై జీవన్‌రెడ్డి ఫైర్

కెసిఆర్‌పై జీవన్‌రెడ్డి ఫైర్

Jeevan Reddy fire on Telangana Government
హైదరాబాద్: సిఎం కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తునన్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్ టిసి కార్మికులు సమ్మెకు దిగనున్నారని,  సమ్మె చేస్తే ఆర్ టిసి చరిత్రలో ఇదే చివరి సమ్మె అవుతుందని  కెసిఆర్ హెచ్చరించడం  బాధకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్ టిసి కార్మికులు ముఖ్య పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఆర్ టిసి కి రాయితీలు కల్పించడం లేదని ఫైర్ అయ్యారు. డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడమేంటనీ ప్రశ్నించారు. ఆర్ టిసి దివాళా తీయడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.