Home జగిత్యాల తెలంగాణను అప్పులపాలు చేసిన కెసిఆర్

తెలంగాణను అప్పులపాలు చేసిన కెసిఆర్

jeevan-reddy

జిగిత్యాల: కాంగ్రెస్ 58 ఏండ్ల పాలనలో రూ. 56వేలకోట్లు అప్పులు చేస్తే, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో రూ.1.40లక్షల కోట్లు అప్పుచేసిందని సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.  టిఆర్ఎస్ సర్కార్ ఎన్నికల ప్రచారంలో లక్ష ఉద్యోగాలకు హామీ ఇచ్చిందని, ఇప్పటి వకరకు కేవలం 12వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని ఆయన పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టాన్ని ఈ సంవత్సరం అయిన అమలు చేయాలని ఆయన కోరారు. మిషన్ భగీరథను కేవలం పైపులైన్లలో కమీషన్లను ఆశించే మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంలో 62 శాతం మంది ఎకరానికి పైగా భూములున్న రైతులేనని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంతో చిన్న రైతులకు ఎలాంటి మేలు జరగదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.