Home తాజా వార్తలు జనవరి 1న ‘జెర్సీ’ ఫస్ట్ లుక్!

జనవరి 1న ‘జెర్సీ’ ఫస్ట్ లుక్!

 

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని ఇటీవల అక్కినేని నాగార్జునతో కలిసి ‘దేవదాసు’ చిత్రంతో ప్రేక్షకుల అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. ఈ సినిమాలో నాని క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. క్రికెటర్ పాత్రలో సహజత్వం కోసం నాని కొన్ని రోజుల పాటు క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడట. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది.

కాగా, జనవరి 1న అర్జున్ పాత్ర .. అందరినీ కలవనున్నట్టుగా ఒక పోస్టర్ తాజగా బయటికి వచ్చింది. దీంతో ఆ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటి రానున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను 2019 ఏప్రిల్ 19వ తేదీన  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Jersey Movie First Look release on Jan 1st