Home తాజా వార్తలు ప్రతి భర్తకు, ప్రతి భార్యకు నచ్చుతుంది

ప్రతి భర్తకు, ప్రతి భార్యకు నచ్చుతుంది

నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ “మా నాన్న ఆర్మీలో పనిచేస్తారు. ఆయన ఉద్యోగరీత్యా మేము సికింద్రాబాద్‌లో ఆరు సంవత్సరాలు ఉన్నాం. దీంతో నాకు తెలుగు బాగానే అర్థమవుతుంది.

ఇక ‘జెర్సీ’లో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఏమి ఆలోచించకుండా వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నా పాత్ర పరిధి మేరకు నేను బాగానే నటించాను. అయితే తెలుగులో డైలాగ్‌లు చెప్పే సందర్భంలో మాత్రం కొంతవరకు ఇబ్బందిగా అనిపించేది. ఆ సమయంలో నాని చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో విభిన్నమైన భావోద్వేగాలను పండించే సన్నివేశాల్లో నటించే అవకాశం వచ్చింది. ప్రతి భర్తకు, ప్రతి భార్యకు ఈ సినిమా నచ్చుతుంది. వారి హృదయాలను తాకే చిత్రమిది. ప్రస్తుతం ఆది సాయికుమార్‌తో ‘జోడి’ సినిమా చేస్తున్నాను. అలాగే సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ సినిమా కూడా చేస్తున్నాను”అని అన్నారు.

Jersey movie release on April 19th