Home తాజా వార్తలు నాని ‘జెర్సీ’ ట్రైలర్ చూశారా..?

నాని ‘జెర్సీ’ ట్రైలర్ చూశారా..?

Jerseyహైదరాబాద్: నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం ‘మ‌ళ్ళీ రావా ఫేం’ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమాలో నాని అర్జున్ అనే పాత్ర‌లో క్రికెట్ లో ఎదగాలని భావించే ఆటగాడిగా కనిపించనున్నాడు. క్రికెట్ కోసం ఓ యువ ఆటగాడు పడే తపన, ఆపై పదేళ్ల పాటు క్రికెట్ కు దూరమై, తిరిగి జట్టులోకి వచ్చేందుకు పడిన శ్రమను చూపుతూ ట్రైలర్ విడుదల చేశారు. యుక్త వయసులో ఆటలో అదరగొడుతుంటే, ఆకర్షణలో పడ్డ అమ్మాయితో హాట్ సీన్స్ ట్రైలర్ లో చూపించారు. కొడుకు పుట్టిన తరువాత, సరైన సంపాదన లేక హీరో పడే అవస్థలు, డబ్బు కోసం భార్యను అడిగి కాదనిపించుకోవడం, ఆపై భార్య పర్సులోనే దొంగతనం చేయాలని చూడటం వంటి సెంటిమెంట్ సీన్లు కూడా ఉన్నాయి. ‘జెర్సీ’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నానికి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

JERSEY Theatrical Trailer is Released