Home మహబూబ్‌నగర్ బస్సు, డిసిఎం ఢీ: తప్పిన ప్రమాదం

బస్సు, డిసిఎం ఢీ: తప్పిన ప్రమాదం

jest miss in the accident: bus and DCM

దేవరకద్ర : మండల కేంద్రానికి సమీపంలోని పెద్దగోప్లాపూర్ మూలమలుపు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెళ్తుండగా స్పీడు బ్రేకర్ ఉండడంతో వెనుక నుంచి వస్తున్న డిసిఎం చూసుకోకుండా బస్సును ఢీకొట్టింది.  బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ నుంచి మక్తల్‌కు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు వెనక నుంచి వేగంగా వస్తున్న డిసిఎం ఢీకొట్టింది. బస్సులో ప్రయాణీలు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి ఎస్‌ఐ అశోక్‌కుమార్ చేరుకుని పరిశీలించి డిసిఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.