Home అంతర్జాతీయ వార్తలు రోడ్డు పై విమానం క్రాష్… తప్పించుకున్న కారు

రోడ్డు పై విమానం క్రాష్… తప్పించుకున్న కారు

Jet Flight Crash

కెనడాలోని మార్ఖమ్‌లో  ప్రమాదం  జరిగింది.అది  చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. జెట్ విమానం ఒకటి బట్టన్‌విల్లే ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా పైకి ఎగరలేక కంట్రోల్ తప్పి నడి రోడ్డు మీద క్రాష్ అయింది.  విమానం క్రాష్ అయ్యేటప్పుడు మాత్రం ఏ వాహనం రాలేదు. ఒక్క క్షణం ఆలస్యంగా ఓ కారు వచ్చింది. అప్పటికే కారు బ్యానెట్‌ను రాసుకుంటూ  విమానం వెళ్లింది. ఈ ఘటన కారులోని కెమెరాలో రికార్డయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు. కారులోని వ్యక్తులకు ఏటువంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Jet Flight Crash In Canada