Home తాజా వార్తలు విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వి కపూర్?

విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వి కపూర్?

Jany Kapoor act with Hero Vijay Devarakonda

jhanvi kapoor & Vijay Devarakonda New Movie

హైదరాబాద్ : అలనాటి అందాల తార శ్రీదేవి పెద్దకూతురు జాన్వి కపూర్ తెలుగు హీరో విజయ్ దేవరకొండకు జోడీగా నటించనున్నారని చిత్రపరిశ్రమలో పుకార్లు షికారు చేస్తున్నాయి. శ్రీదేవి టాలీవుడ్, బాలీవుడ్‌లలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్‌లో శ్రీదేవి కన్నుమూశారు. జాన్వి ఇటీవల విడుదలైన ‘ధడక్ ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే హీరో విజయ్‌దేవరకొండ సరసన జాన్వి రెండు చిత్రాల్లో నటించనున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రంలో ఆమె విజయ్‌కు జోడీగా నటించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని జాన్వి ఇంకా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం జాన్వీ ‘తఖ్త్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. కరీనాకపూర్, విక్కీ కౌశల్, ఆలియాభట్, రణ్‌వీర్‌సింగ్, భూమి పడ్కేర్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Jany Kapoor act with Hero Vijay Devarakonda