Home ఆఫ్ బీట్ వీడియోలు కిస్సింగ్ కాంటెస్ట్..!

కిస్సింగ్ కాంటెస్ట్..!

Kissing-Contest

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని దుమరియాలో గత 37 ఏళ్లుగా ప్రతియేట జరిగే  ఓ ఉత్సవంలో ఈ ఏడాది జెఎంఎం పార్టీ ఎంఎల్‌ఎ సిమన్ మరాండి అక్కడి గిరిజనులకు ఒక కొత్త ఆటను పరిచయం చేశారు. అదే… కిస్సింగ్ కాంటెస్ట్(ముద్దుల పోటీ). పెళ్లైన దంపతులు ఇందులో పాల్గొనడానికి అర్హులు. పోటీలో పాల్గొనేవారు చేయాల్సిందేమిటంటే… పబ్లిక్‌లో తమ భాగస్వామిని ముద్దాడటం. ఇలా ఏ దంపతులైతే ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటారో వారు పోటీలో గెలిచినట్లు. అయితే ఈ పోటీలు నిర్వహించడానికి ఎంఎల్‌ఎ మరాండి చెప్పిన కారణం ఏమిటో తెలుసా?… ఇలా అందరిముందు భార్యభర్తలు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం వల్ల వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గడంతో పాటు ప్రేమ పెరిగి దంపతులు విడిపోవడాలు తగ్గుతాయట. గత 37 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో గిరిజనులు నృత్యం, ఆర్చరీ, పరుగు వంటి పోటీల్లో పాల్గొనేవారు. అయితే ఈ ఏడాది కొత్త అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. నలుగురు జంటలు మాత్రమే ఈ ముద్దుల పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చారు.

Jharkhand hosts open kissing contest for couples.