Home అంతర్జాతీయ వార్తలు కిమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన జీ జిన్‌పింగ్

కిమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన జీ జిన్‌పింగ్

KIMసియోల్ : ఉత్తరకొరియా అధికార వర్కర్స్ పార్టీ చైర్మన్‌గా ఎన్నికైన కిమ్ జాంగ్ ఉన్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు జిన్‌పింగ్ కిమ్‌కు సందేశాన్ని పంపించారు. కిమ్‌కు శుభాకాంక్షలు తెలిపిన తొలి దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అన్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియాతో సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని జిన్‌పింగ్ కిమ్‌కు పంపిన సందేశంలో తెలిపారు. ఉత్తరకొరియా 36 ఏళ్లలో తొలిసారి పెద్ద ఎత్తున పార్టీ సమావేశాలు నిర్వహించింది. సోమవారం కిమ్ను అధికారికంగా పార్టీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అయితే ఈసారి సమావేశాల్లో చైనా ప్రాతినిధ్యం ఎక్కడా కనిపించలేదు. 1980లో జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున చైనా ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తరకొరియా ఇప్పటికే పలు మార్లు అణుపరీక్షలు , క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.