Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

జికా వైరస్ జన్యుక్రమం ఆవిష్కరణ

Jika-Virusబీజింగ్ : చైనాకు తొలిసారిగా దిగుమతి అయిన జికా జన్యుక్రమాన్ని విజయవంతంగా ఆవిష్కరించింది. ఈ విషయాన్ని ఆ దేశ సైంటిస్టులు వెల్లడించారు. ఇది వ్యాధి నివారణ, నిర్ధారణలో సహాయపడుతుందని వారు భావిస్తున్నారు. చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం సైంటిస్టులు ఈ ఘనతను సాధించారు. తాజా విజయంతో వైరస్ వైవిధ్యాల్ని , రోగ నిర్ధారణ అవకాశాలను అవగాహన చేసుకోవడానికి పునాది పడినట్లు క్సిన్హువా తెలిపింది. దేశంలో దిగుమతి అయిన తొలి జికా కేసును ఈనెల 9న నిర్ధారించారు.

Comments

comments