Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జియో 4జి ఫోన్ ప్రీ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Jio-4G-Mobile

ముంబయి: ప్రస్తుతం రిలయన్స్ జియో ఇంపాక్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి దూసుకుచ్చిన జియో అనతికాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. దాంతో జియో మరో ప్రభంజనానికి తెరతీసింది. అదే.. జియో 4జి ఫీచర్ ఫోన్. కేవలం రూ. 1500 సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఫోన్ ఉచితంగా కస్టమర్లకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

దీంతో అతి తక్కువ ధరలో 4జి మొబైల్ వస్తుడటంతో వినియోగదారులు జియో ఫోన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ  ఫోన్ రిలీజ్ మరికొన్ని గంటల్లో కానుంది. ఇంతకుమందు చెప్పినట్టుగానే ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్‌ ఓపెన్ కానున్నాయి. అయితే జియో ఫోన్ ను ఎంత మంది కావాలనుకుంటున్నారు అనే అనే అంశాన్ని నిర్ధారించేందుకుగాను  జియో ‘రిజిస్ట్రేషన్ ఇంట్రెస్ట్’ ఓపెన్ చేసింది.

ఫస్ట్‌ కం ఫస్ట్‌ సెర్వ్‌ కింద సెప్టెంబరు ఒకటి నుంచి ఫోన్ల డెలివరీ ఉండనుంది. ఇందుకోసం సోమవారం నుంచే (ఆగస్టు -14) నుంచే  రిజిస్ట్రేషన్  ప్రారంభించింది జియో. jio.com వెబ్ సైట్ లో పేరు, ఫోన్ నంబర్, పిన్ కోడ్ వివరాలను ఇస్తే చాలు స్పాట్ లో మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. ఇందుకు సంబంధించిన OTP కూడా వస్తుంది. ఇంకేందుకు ఆలస్యం మీరూ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి.

Comments

comments