Search
Sunday 23 September 2018
  • :
  • :

4జి స్పీడ్‌లో జియోనే ఫస్ట్: ట్రాయ్

jioముంబయి : అత్యంత వేగవంతమైన 4జి స్పీడ్‌తో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. 4జి స్పీడ్‌లో ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంటే జియో ముందుందని ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) పేర్కొంది. 2016 డిసెంబర్ వరకు టెలికామ్ కంపెనీల 4జి వేగంపై ట్రాయ్ వెల్లడించి నివేదికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.  అక్టోబర్‌లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ వంటి ప్రత్యర్థి సంస్థల కంటే నెమ్మది నెట్‌వర్క్‌ను జియో కల్గి ఉంది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో పూర్తి భిన్న మైన పరిస్థితులు కనిపించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన డాటా స్పీడ్ పరీక్ష వివరాలను ట్రాయ్ కు చెందిన ’మైస్పీడ్ ఆన్ లైన్’ పోర్టల్ లో ట్రాయ్ వెల్లడించింది. ప్రస్తుతం 9.9 ఎంబిపిఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో జియో 4జి మొదటి స్థానం లో ఉండగా, 5.8 ఎంబిపిఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ తో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిలి చింది. 4.2 ఎంబిపిఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో వొడాఫోన్ మూడోస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐడి యా, రిల యన్స్, టెలి నార్, సెల్ వన్, ఎయిర్ సెల్ ఉన్నాయి. అప్ లోడ్ స్పీడ్‌లో 2.8 ఎంబిపిఎస్ వేగంతో టెలి నార్ మొదటి స్థానం లో ఉండగా, జియో రెండోస్థానంలో ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట రిలయన్స్ జియో మార్చి 31 వరకు ఉచితంగా వాయిస్ కాల్స్, డాటా, వీడియోకాల్స్, ఎస్సెమ్మెస్ ఆఫర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Comments

comments